సీఐపై లోకాయుక్తలో ఫిర్యాదు
చిట్‌ఫండ్ దివాలా.. ఏజెంట్ ఆత్మహత్య
సిరిసిల్లటౌన్: తనపై అక్రమ కేసు బనాయించినందుకు గాను సిరిసిల్ల టౌన్ సీఐపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు ఏఐఎఫ్‌టీయూ న్యూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. శనివారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో మాట్లాడారు. స్థానిక శాంతినగర్‌లోని సర్వే నంబర్ 40లో ఓపెన్ ప్లాట్‌కు సంబంధించి సమస్యపై తా ను ఫిర్యాదు చేసేందుకు వెళ్తే టౌన్ సీఐ పట్టించుకో లేదన్నారు. పైగా పట్టణానికి చెందిన వారు తనపై దుర్భాషలాడుతూ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు పెట్టి స్టేషన్‌లోనే 36 గంటలు బంధించినట్లు వెల్లడించారు. కేవలం కాంగ్రెస్ నాయకులు అనే భావంతో వారు చెప్పిన విధంగా తనపై అక్రమ కేసులు బనా యించారని, తనకు జ రిగిన అన్యాయంపై లోకా యుక్తకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సమావేశంలో తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకుడు ఎల్లన్న గర్దాస్ శ్రీనివాస్, పాండు, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన చింతల రాజయ్య (39) అనే అక్షర చిట్‌ఫండ్ ఏజెంట్ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య 15ఏళ్లుగా అక్షరచిట్‌ఫండ్‌తో పాటు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కొనసాగుతున్నాడు. అక్షర చిట్‌ఫండ్ ఏజెంట్‌గా వ్యవహరించిన సమయంలో పలువురివద్ద చిట్టీలు వేయించడంతో పాటు ఎఫ్‌డీలు చేయించాడు. ఇటీవల అక్షర చిట్‌ఫండ్ యాజమాన్యం చేతులెత్తేయడంతో డబ్బుల కోసం బాధితులంతా రాజయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీశారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాజయ్య మనస్తాపానికి గురై శనివారం వేకువజామున ఇంటి వెనకాలున్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు.
సీఐపై లోకాయుక్తలో ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment