రంజాన్.. జీవనమార్గం
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్‌కల్చరల్: స్వీయ సంస్కారం.. ప్రాణికోటిపై సానుభూతి.. ప్రకృతిపై పవిత్రభావన.. తోటి మనుషులపై సోదరభావన.. ఇవీ రంజాన్ మాసం నేర్పే లక్షణాలు. ఈ ఉత్తమ లక్షణాలను ఆపాదించుకొని ప్రాపంచిక జీవనమార్గం ఏర్పరచుకునేందుకు ముస్లింలు కఠిన ఉపవాసదీక్షలు స్వీకరిస్తారు. ఆకాశంలో కనిపించే నెలవంకే సాక్ష్యంగా రంజాన్ మాసాన్ని ఆరంభిస్తారు. ఆదివారం నుంచి ఆరంభమయ్యే ఉపవాస దీక్షలు ఈనెల రోజులు ఆచరిస్తారు.
ప్రతీది ప్రత్యేకం
ఈ మాసంలో ఉదయం సహరీలు, సాయంత్రం ఇఫ్తార్ విందులతో దీక్ష విరమణ సాగుతోంది. దానధర్మాలతో నిరుపేదలను ఆదుకోవడం, ఫిత్రా దానాలు ఆచరించడం ప్రత్యేకతలు. క్రమశిక్షణ, దాతృత్వ భావన, ధార్మిక చింతన వంటి సుగుణాలను రంజాన్ నెల అందిస్తోంది. రోజాగా పిల్చుకునే ఉపవాసాలు ప్రతీ సాయంత్రం ఇఫ్తార్‌తో ముగుస్తాయి. తక్కువ సంభాషణ.. సత్యమే మాట్లాడడం ఉపవాస దీక్షలో కీలకమైనవి. రుతుక్రమం ఉన్న వారు, పసి పిల్లలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, వయోవృద్ధులు, గర్భిణులు, ప్రయాణాల్లో ఉన్నవారు ఉపవాస దీక్షకు మినహాయింపు.
జకాత్
దానం చేయడం.. ధర్మం ఆచరించడమే జకాత్. సంపన్నులు పేదలు పండుగ జరుపుకునేందుకు తోచినంత ఆర్థికసాయం చేయాలి. అల్లాహ్ అనుగ్రహానికి వారిని కూడా పాత్రులను చేయాలనే ఉద్దేశంతో ప్రతీ ధనికముస్లిం వారి ఆదాయం లోంచి కనీసం 30 శాతం ధనాన్ని నిరుపేదల అభ్యున్నతికి వినియోగించాలనేది ఫర్జ్(నియమం). ప్రవక్త నియమాన్ని అనుసరించి పేదలను ఆదుకునే దానధర్మాలను ఆచరించడం ఈ మాసం ప్రత్యేకత.
షబ్ ఏ ఖద్ర్
ముస్లింల మతగ్రంథం ఖురాన్ ఈనెలలోనే ఆవిర్భవించిందని చెబుతుంటారు. రంజాన్ మాసాంతంలో వచ్చే చివరి శుక్రవారం ఖురాన్‌ను దైవదూత మహ్మద్ ప్రవక్త ద్వారా మానవాళికి అందించాడని పేర్కొంటారు. ఈ కారణంగానే షబ్ ఏ ఖద్ర్ రోజున ప్రార్థన మందిరాల్లో జాగరణలు, ఖురాన్ పఠనం చేస్తారు. తరాహ్‌వీ నమాజ్‌లతో మసీదులు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి. అత్యంత పవిత్రమైన రాత్రిగా పరిగణించే షబ్ ఏ ఖద్ర్ ముస్లింలకు ఆరాధనీయమైంది.
స్వీయసంస్కారం.. ప్రాణికోటిపై సానుభూతి
తోటి వారిపై సోదరభావన
పవిత్రభావాల విడిది..
దానధర్మాల మాసం
నేటి నుంచి కఠిన ఉపవాసదీక్షలు
Comments
Please login to add a commentAdd a comment