‘టాస్క్’ శిక్షణకు రిజిస్ట్రేషన్లు షురూ
పెద్దపల్లిరూరల్: టాస్క్ ద్వారా శిక్షణ పొందేందుకు ఆసక్తి గలవారు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. వెబ్ అప్లికేషన్లు, జావా ప్రోగ్రామింగ్, పైతాన్ ప్రోగ్రామింగ్, సీ ప్రోగ్రాం, సీ ప్లస్ ప్రోగ్రామింగ్, టాటా ప్లస్ ప్రోగ్రామింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్రజంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, టాలీ, జీఎస్టీ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంసీఏ, పాలిటెక్నిక్ చదువుతున్న లేదా పూర్తి చేసినవారు శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సెంటర్‌లోనే బహుళజాతి సంస్థల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఇటీవల యాక్సిక్‌బ్యాంకు నిర్వహించిన జాబ్‌మేళాలో ఇక్కడి టాస్క్ సెంటర్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు భవాని, రసజ్ఞ, హేమంత్‌కు రూ.24లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయని మేనేజర్ గంగాప్రసాద్ తెలిపారు.
15లోగా బ్యాంకు లింకేజీ పూర్తికావాలి..
జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు 90శాతం మేర రుణాలు పంపిణీ పూర్తిచేశామని, మిగతా 10శాతం లింకేజీని ఈనెల 15వ తేదీ వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సీ్త్రనిధి రుణాల రికవరీ 72 శాతం నుంచి 80శాతానికి పెంచడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లు లాభదాయకంగా నడిచేలా సహాయ, సహకారాలు అందజేయాలన్నారు. పెట్రోల్ బంకు, గ్యాస్ ఏజెన్సీ, డెయిరీ లాంటి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీ హబ్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మహిళలను సన్నద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు. డీఆర్‌డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవికుమార్ తదితరులు ఉన్నారు.
గడువులోగా పనులు పూర్తి
పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ఆయా పనులకు అవసరమైన నిధులను కేటాయించామని పేర్కొన్నారు. పనులు ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద మంజూరు చేసిన సిమెంట్‌రోడ్డు పనులు ఈనెల 15లోగా పూర్తి చేసి బిల్లులు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఈఈ గిరీశ్‌బాబు, సీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
Comments
Please login to add a commentAdd a comment