వైభవంగా నాగవెల్లి పట్నం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నాగవెల్లి పట్నం

Published Mon, Mar 3 2025 12:07 AM | Last Updated on Mon, Mar 3 2025 12:06 AM

వైభవం

వైభవంగా నాగవెల్లి పట్నం

జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక శ్రీరావుల మల్లికా ర్జునస్వామి పట్నాలు, బోనాల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఒగ్గు పూజారులు నాగవెల్లి పట్నం వేశారు. యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత మహిళలు గ్రామంలో బోనాలతో ఊరేగింపు నిర్వహించా రు. పట్నంపై నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. సాయంత్రం ఆగ్నిగుండాల్లో నడిచి భక్తిని చాటుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్‌, దారబోయిన నర్సింహయాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు.

క్యూఆర్‌ కోడ్‌తో ఇంటర్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపు

జ్యోతినగర్‌(రామగుండం): ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాసే వి ద్యార్థులకు హాల్‌టికెట్‌పై ఉన్న క్యూర్‌ కోడ్‌ అండగా ఉంది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్థుల హాల్‌టికెట్‌పై ఉన్న క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సంబంధిత పరీక్ష కేంద్రం వివరాలు గూగుల్‌ మ్యాప్‌లో కనిపిస్తాయి. విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్‌ బోర్డు ప్రథమంగా క్యూర్‌ కో డ్‌తో కూడిన స్మార్ట్‌హాల్‌ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనిద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం జరుగనుంది. హాల్‌టికెట్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్‌ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామాతోపాటు లొకేషన్‌ దృశ్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా తెలిసిపోతుంది. చాలామంది విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాల వివరాలను స్కాన్‌ చేసి చూస్తున్నారు.

5న స్ట్రక్చరల్‌ సమావేశం

గోదావరిఖని: సింగరేణి సంస్థలో నెలకొన్న సమస్యలపై హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో ఈనెల 5న స్ట్రక్చరల్‌ సమావేశం నిర్వహించనున్నారు. సంస్థ సీఎండీ బలరాం అధ్య క్షతన, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో సమస్యలపై చర్చించనున్నారు. వాస్తవంగా గతనెల 5న స్ట్రక్చరల్‌ సమావేశం తేదీ ఖరారైనా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో వాయిదా పడింది. కోడ్‌ ముగియడంతో నెలరోజు తర్వాత గు ర్తింపు యూనియన్‌తో సమావేశం తేదీ ఖరారైంది. ప్రధాన సమస్యలతో కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న కార్మికుల్లో ఈసమావేశం ఆశలు రేకెత్తిస్తోంది.మారుపేర్ల సమస్య, విజిలెన్స్‌తో ఆగిపోయిన డిపెండెంట్‌ ఉద్యోగులుఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పె ర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ మాఫీ, డిసిగ్నేషన్ల మా ర్పు, కార్మికుల ప్రమోషన్‌ పాలసీ అమలు చే యడం, సొంతింటి కల నెరవేర్చడంతోపాటు అనేక సమస్యలను ఈ సమావేశంంలో చర్చించనున్నారు. గుర్తింపు యూనియన్‌గా గెలిచి 15 నెలల తర్వాత తొలిసారిగా నిర్వహించే సీఎండీ స్థాయి సమావేశంపై సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు.

నియామకం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ జి ల్లా కార్యదర్శింగా సాంబా రి రాజేశ్‌ను నియమించా రు. ఈమేరకు యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. బీసా సామాజికి వర్గానికి చెందిన రాజేశ్‌ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి స న్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెల కొంది. ఉ త్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఖండేలరాయు డు, నందీశ్వరుడు, శ్రీసీతారామచంద్రస్వామి ని దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నావు వేయించి, బోనాలతో నైవేద్యం సమర్పించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కుమారస్వామి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైభవంగా నాగవెల్లి పట్నం 1
1/4

వైభవంగా నాగవెల్లి పట్నం

వైభవంగా నాగవెల్లి పట్నం 2
2/4

వైభవంగా నాగవెల్లి పట్నం

వైభవంగా నాగవెల్లి పట్నం 3
3/4

వైభవంగా నాగవెల్లి పట్నం

వైభవంగా నాగవెల్లి పట్నం 4
4/4

వైభవంగా నాగవెల్లి పట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement