ప్రశాంతంగా ఉండండి
● మంచిగా ఆలోచన చేయండి ● సాఫీగా పరీక్షలు రాయండి
● అద్భుత ఫలితాలు వస్తాయి ● సమస్యలకు టోల్‌ఫ్రీ నంబరు 14416
● ‘సాక్షి’తో ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన
సాక్షి: ఈసారి కూడా కఠిన నిబంధనలు ఉంటాయా?
నోడల్ అధికారి: ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరు.
సాక్షి: విద్యార్థుల్లో ఎగ్జామ్ ఫీవర్ పోగొట్టేందుకు తీసుకున్న చర్యలు ఏమిటి?
నోడల్ అధికారి: విద్యార్థులకు చదువుతో పాటే పరీక్షల నిర్వహణ తీరుపై అవగాహన కల్పించాం. పరీక్ష అనగానే భయపడాల్సిన పనిలేదని సులువుగా అర్థమయ్యేలా అధ్యాపకులు వివరించారు. ఇందుకోసం 100రోజుల యాక్షన్‌ప్లాన్ చేపట్టాం.
సాక్షి: మంచి ఫలితాలు సాధిస్తారా?
నోడల్ అధికారి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానంపై అవగాహన కల్పించాం. కాలేజీల్లో ప్రత్యేక తరగతులతోపాటు ఇంటివద్ద చదివేలా తల్లిదండ్రులు, విద్యార్థులకు వేకప్‌కాల్స్‌తో (ఉదయం 5నుంచి ఉద యం 6గంటల మధ్య) అలర్ట్ చేశాం. ప్రశ్నాపత్రాలను వివిరిస్తూ సమాధానాలు రాసే పద్ధతులపై అధ్యాపకులు అవగాహన కల్పించారు.
సాక్షి: విద్యార్థుల్లో శారీరక, మానసిక సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్చలేమిటి?
నోడల్ అధికారి: పరీక్షా సమయంలో విద్యార్థులు మానసికంగా దృఢత్వం కలిగి ఉండేలా కౌన్సెలర్లు అవగాహన కల్పించారు. బాలికలకు మహిళా కౌన్సెలర్, బాలురకు పురుష కౌన్సెలర్ సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇంకా ఏమై నా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 14416 కు కాల్‌చేసి సలహాలు, సూచనలు పొందొచ్చు.
పెద్దపల్లిరూరల్: ‘పరీక్షలు అంటేనే విద్యార్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఆందోళన పడతారు.. అలాంటి భయాన్ని, ఆందోళనను పోగొట్టేందుకు వంద రోజుల కార్యాచరణ అమలు చేశాం.. పరీక్షలకు చిన్నారులను ఎలా సిద్ధం చేయాలనే దానిపై వేకప్ కాల్స్‌తో అధ్యాపకులు తరచూ తల్లిదండ్రులకు అవగాహ న కల్పించారు.. వారి ద్వారా విద్యార్థుల్లో మానసిక, శారీరక స్థైర్యం పెంపొందింది. ఇందుకోసం ఓ మహిళా, పురుష అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించాం. సమస్యలు పరిష్కరించాం.. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాం’ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 14416కు కాల్‌చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు..
సాక్షి: తల్లిదండ్రులకు ఇచ్చిన సూచనలు ఏమిటి?
నోడల్ అధికారి: ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ పేరెంట్స్ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించాం. ఇంటివద్ద పిల్లల వ్యవహారశైలిని గమనించి చదువుపై శ్రద్ధ చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. ఏకాగ్రతతో చదివితే మంచిఫలితాలు సాధించడం సులువుగా ఉంటుందని చెప్పాం.
Comments
Please login to add a commentAdd a comment