శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
● మంత్రి శ్రీధర్‌బాబు ● ఘనంగా మాజీ స్పీకర్ జయంతి
మంథని/పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/రామరి: మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా మంథని శ్రీపాద చౌరస్తా, రామగిరి మండలం రామయ్యపల్లిలోని శ్రీపాదరావు విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించా రు. అనంతరం మంత్రి మాట్లాడారు. పేద, బడు గు, బలహీ న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఐలి ప్రసాద్, కొత్త శ్రీనివాస్, శశి భూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, పెండ్రు రమ, మంథని సత్యం, శంకర్ తదితరులు ఉన్నారు.
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్‌లో అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ కోయ హర్ష, అదనపు కలెక్టర్ వేణు తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను సూపరింటెండెంట్ బండి ప్రకాశ్ చదివి వినిపించారు. జిల్లా క్రీడల శాఖ అధికారి సురేశ్, డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని శ్రీపాదరావు చిత్రపటానికి ఎమ్మె ల్యే విజయరమణారావు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, డి.దామోదర్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, వేగోళం అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్ పాల్గొన్నారు.
గోదావరిఖని: రామగుండం సీపీ శ్రీనివాస్ కమిషనరేట్‌లో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమా ల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ .రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆర్ ఐలు వామనమూర్తి, శ్రీనివాస్, సంపత్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
Comments
Please login to add a commentAdd a comment