అటవీ సంపద కోసమే ఆపరేషన్ కగార్
గోదావరిఖని: అడవుల్లో సంపదను బహుళజాతి సంస్థలకు అమ్ముకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని రాష్ట్ర పౌర హక్కుల సంఘం కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టు, డిఫెన్స్‌ఫోర్స్ నాయకుడు రాజేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్య భారత దేశంలోని దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులు, ఆదివాసీలను హతమారుస్తున్నారన్నారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఆ తర్వాత అక్క డ ఉన్న అపారమైన ఖనిజ సంపదను బహుళజా తి సంస్థలకు అమ్ముకోవడానికి చూస్తోందని ఆరోపించారు. రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న మాట్లాడు తూ దేశ సంపద మొత్తం 500 మంది చేతుల్లో ఉందని, పాలకులు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ సంపదని కొల్లగొడుతున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అందరికీ వర్తింపచేయాలని, కనీస సదుపాయాలైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి అందించాలని కోరారు. ఆదివాసీలపై దాడులు ఆపి, పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల నెపంతో చంపేసిన ఆదివాసీ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని, ఈవిషయంపై సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజన్న, దుర్గం నరేశ్, నారా వినోద్, బొడ్డుపల్లి రవి, లక్ష్మణ్, ఏలేశ్వరం వెంకటేశ్, వెలుతురు సదానందం పాల్గొన్నారు.
● పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment