‘ఏఐటీయూసీని విమర్శించే అర్హత లేదు’
గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించవద్దన్న యూనియన్లకు తమను విమర్శించే అర్హత లేదని ఏఐటీయూసీ అ ధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్య దర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. స్థానిక భా స్కర్‌రావుభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కా ర్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల పెండింగ్ సమస్యలపై ఈనెల 5న జరిగే సీ ఎండీ స్థాయి సమావేశంలో చర్చిస్తామన్నారు. అ లవెన్సులపై ఆదాయపు పన్ను యాజమాన్యమే చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాజమా న్యం పంచన చేరి, కార్మికులకు ద్రోహం చేస్తున్న కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గతేడాది నవంబర్ 28న కొత్తగూడెంలో డైరెక్టర్(పా) స్థాయి స మావేశంలో కార్మికుల పెండింగ్ సమస్యలపై అ వగాహన కుదిరిందని, వాటిపై ఉత్తర్వులు రావాల్సిన ఉందని తెలిపారు. నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, ముస్కె సమ్మయ్య, కవ్వంపల్లి స్వామి, రంగు శ్రీనివాస్, గౌస్, ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment