7న శ్రామిక మహిళల ర్యాలీ
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా శ్రామికుల సంఖ్య పెరుగుతు న్నా కనీస వేతనాలు అందడం లేదని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ జ్యోతి అన్నా రు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాల యంలో నాయకురాలు నాగమణి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలని సీఐటీయూ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా 7న జి ల్లా కేంద్రంలో శ్రామిక మహిళలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, మహిళా సాధికారి త సాధనలో పాలకులు విఫలమయ్యారని వి మర్శించారు. ప్రతినిధులు వనజారాణి, రామ లక్ష్మి, భాగ్య, సులోచన, సుశీల, స్వరూప, భా గ్యలక్ష్మి, ముత్యంరావు, రవీందర్ పాల్గొన్నారు.
చింతకాయలు కిలో రూ.200
సుల్తానాబాద్‌రూరల్(పెద్దప ల్లి): పచ్చడికి వినియోగించే పచ్చిచింతకా యలు కిలో రూ.200 వరకు ధర పలుకుతోంది. ఏటా కిలో రూ.30– రూ. 50 మధ్య పలికే పచ్చిచింతకాయ ధర ఈ సారి ఇంత అధికంగా ధర పలకడం ఇదే తొలి సారి. ఈ ఏడాది ఆదినుంచీ కిలో రూ.100కు పైగానే ధర పలుకుతూ వచ్చి.. సోమవారం ఏకంగా రూ.200 వరకు చేరింది. చింతకాయ నిల్వ ప చ్చడి పెట్టుకునేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతోనే ధర పెరుగుతూ వస్తోందని వ్యాపారులు వివరిస్తున్నారు.
క్వింటాల్ పత్తి రూ.6,628
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,628 ధర పలికింది. కనిష్టంగా రూ.5,009, సగటు ధర రూ.6,323గా నమోౖదైందని మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప తెలిపారు. మొత్తం 590 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆమె వివరించారు.
‘మోసం చేసిన బీఆర్‌ఎస్’
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ప్రజలను మ భ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకే దక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వి మర్శించారు. కాట్నపల్లిలో సోమవారం ఆయ న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. డ బుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇల్లు ఇ వ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించా రు. మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. నాయకులు అన్నయ్యగౌడ్, ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, మహేందర్, దామో దర్, సంతోష్‌రావు, ఆనందరావు, శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు రాయితీ
కోల్‌సిటీ(రామగుండం): స్థలాల క్రమబద్ధీకర ణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చెల్లించాల్సిన రుసుం మొత్తంలో 25 శాతం రాయితీ క ల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు జీవోఎంస్ నంబరు 28 ఎంఏ –యూడీ తేదీ: 20.02.2025 ద్వారా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష, బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ కోరారు. వివరాలకు బల్దియా లోని హెల్ప్‌డెస్క్‌లో స్వయంగా లేదా ఫోన్ నంబర్లు 63029 73409, 91823 09215, 93981 30997లో సంప్రదించాలని వారు కోరారు.
7న శ్రామిక మహిళల ర్యాలీ
7న శ్రామిక మహిళల ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment