ధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని తీగలధర్మారంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. తుమ్మెనాలకు చెందిన అప్పాల మల్లయ్య (56) దొంతాపూర్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. రాత్రి తిరుగు పయనం అయ్యాడు. దోనూర్, తీగలధర్మారం మధ్య ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో మల్లయ్యకు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న దోనూర్ గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించినట్లు బంధువుల ద్వారా తెల్సింది. మల్లయ్యకు భార్య, కొడుకు మహేష్, కూతురు లత ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మల్లయ్య స్థానికంగా ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
జగిత్యాల క్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద.. కరీంనగర్–జగిత్యాల ప్రధా న రహదారిపై ట్రాలీఆటోను మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జగి త్యాల శివారు టీఆర్‌నగర్‌కు చెందిన కడారి గంగాఽ దర్ (55), అతని బంధువు శ్రీహరి అలియాస్ శ్రీని వాస్‌తో కలిసి ట్రాలీ ఆటోలో టీఆర్‌నగర్ వెళ్తున్నా రు. కరీంనగర్ నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ట్రాలీఆటోను ఢీకొంది. ఈ ఘటనలో గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై సధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment