‘అనంతగిరి’.. పరిహారమేది?
● ప్రాజెక్టు నిర్వాసితులకు అందని ప్యాకేజీ డబ్బులు
● కోర్టుకు వెళ్లినవారికి
ఇళ్ల స్థలాలు కేటాయించలే
● పునరావాస కాలనీలో అరకొర వసతులు
● ఇబ్బంది పడుతున్న బాధితులు
ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన వారికి ఏళ్లుగా న్యాయం జరగడం లేదు. అంతేకాకుండా, నిర్వాసిత కాలనీలోనూ అరకొర సౌకర్యాలే కల్పించారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మించారు. ప్రాజెక్టులో అనంతగిరి పూర్తిస్థాయిలో, సిరికొండ పాక్షికంగా, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి, చెలకలవానిపల్లి పాక్షికంగా మునిగిపోయాయి. వీరందరికీ ఇప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాలేదు.
అసౌకర్యాల మధ్యే..
అనంతగిరికి చెందిన 854 ఇళ్లు పూర్తిస్థాయిలో ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామస్తుల కోసం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటు చేశారు. కానీ, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి, మురికినీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించలేదు. గదుల్లో విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ లేవు. అంగన్‌వాడీ కేంద్రం, సబ్ హెల్త్ సెంటర్ భవనాలు పిల్లర్లకే పరిమితమయ్యాయి. కాలనీలో ప్రధాన రోడ్డు తప్పితే మిగతా రోడ్ల నిర్మాణం అంతంతే. కాలనీలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు.
103 మందికి అందని స్థలాలు
భూ సర్వే చేసిన 2017 సంవత్సరం వరకు 18 ఏళ్లు నిండినవారికి కుటుంబ ప్యాకేజీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అయితే, ఇళ్లు ఖాళీ చేసిన 2020 సంవత్సరం వరకు దీన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇళ్లు, భూముల లెక్క కట్టడంలో అసమానతలు ఉన్నాయని, గ్రామంలోని 103 మంది కోర్టుకు వెళ్లారు. ఇళ్లు ఖాళీ చేసే సమయంలో వీరి ఇంటి స్థలం కేటాయించలేదు. దీంతో వీరి కోసం ప్రత్యేకంగా 103 కోర్టు గదులు నిర్మించారు. వీటిల్లో ప్రస్తుతం కొందరే ఉంటున్నారు.
‘అనంతగిరి’.. పరిహారమేది?
‘అనంతగిరి’.. పరిహారమేది?
Comments
Please login to add a commentAdd a comment