నీతివంతమైన పాలనకే ప్రజల పట్టం
పెద్దపల్లిరూరల్: దేశ ప్రధాని నరేంద్రమోదీ నీతివంతమైన పాలనకే మండలి ఎన్నికల్లోనూ ఓటర్లు పట్టం కట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెండా కూడలి వద్ద మంగళవారం బాణా సంచాకాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకే రాజకీయ పార్టీలు సాహసించలేకపోయాయని సంజీవరెడ్డి అన్నారు. తమ పార్టీ అఽభ్యర్థిగా బరిలో నిలిచిన మల్క కొమురయ్య తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించడం బీజేపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేసిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు చిలారపు పర్వతాలు, పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్, పల్లె సదానందం, రాజగోపాల్, పోల్సాని సంపత్‌రావు, పర్శ సమ్మయ్య, జంగ చక్రధర్‌రెడ్డి, ఉప్పు కిరణ్, రవి, ఓదెలు, క్రాంతి, రాజవీరు, ఈర్ల శంకర్, శివంగారి సతీశ్, బెజ్జంకి దిలీప్, సతీశ్, పిట్ట వినయ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, సందీప్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డితోపాటు నాయకులు కూకట్ల నాగరాజు, కందుల శ్రీనివాస్, కడారీ అశోక్ రావు, కొమ్ము తిరుపతి యాదవ్, నాగుల మల్యాల తిరుపతి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోదావరిఖని: స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ రామగుండం నియోజవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, నాయకులు మచ్చ విశ్వాస్, గుండబోయిన భూమయ్య, కోడూరు రమేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి
నీతివంతమైన పాలనకే ప్రజల పట్టం
Comments
Please login to add a commentAdd a comment