వారియర్స్‌లా ఆలోచించాలి
జ్యోతినగర్(రామగుండం): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు వారియర్స్‌లా ఆలోచించి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు కె.అనిత సూచించారు. అన్ని తెలిసిన ప్రశ్నలు వచ్చాయని, సమయం సరిపోలేదని, అందుకే రాయలేక పోయామని కొందరు అలాగే వదిలేస్తారని పేర్కొన్నారు. ఇలా వర్రీ కాకుండా ప్రశాంతంగా ఆలోచించి పరీక్షలు రాస్తే సత్ఫలితాలు వస్తాయని ఆమె వివరించారు.
ఆమె చేసిన సూచనలు కొన్ని..
● గంట ముందుగానే పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. అనవసర చర్చలకు ఆస్కారం ఇవ్వొద్దు.
● ప్రశ్నాపత్రం తీసుకున్నాక వెంటనే రాయకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు చదవాలి.
● కేటాయించిన మార్కులు, ముందుగా రాసే ప్రశ్నలు, వాటికి కేటాయించే సమయం ఎంచుకోవాలి.
● సులభమైన ప్రశ్నకు ముందుగా జవాబు రాయండి.
● అవసరమైన చోట హెడ్డింగ్, కామాలు, పుల్‌స్టాప్‌లు, డయాగ్రమ్‌లు ఉండేలా చూసుకోవాలి.
● జవాబుపత్రంపై హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండాలి.
● ప్రతీ నిమిషం విలువైనది కాబట్టి.. బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబురాయండి. కొంచెం సమయం తీసుకునే వాటికి తర్వాత ప్రయారిటీ ఇవ్వండి.
● కఠినమైన ప్రశ్నలకు దిగులు చెందకుండా..సులభమైన ప్రశ్నలను తొలుత ప్రారంభించి జవాబులు రాయండి.
● ఐదు నిమిషాల ముందు కాషన్ బెల్ రింగ్ అవుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా రాసిన అన్ని ప్రశ్నలకు సరైన ప్రశ్న నంబర్ వేశామో లేదా చెక్ చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాస్తే విజయం మీ సొంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment