మాతాశిశు కేంద్రంలో ఆధునిక లాండ్రీ సేవలు
● అందుబాటులోకి యంత్రాలు
పెద్దపల్లిరూరల్: స్థానిక మాతా, శిశు ఆస్పత్రిలో మెకనైజ్డ్ లాండ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ఆస్పత్రితోపాటు మాతా, శిశు కేంద్రంలో లాండ్రీ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు వీలుగా మెకనైజ్డ్ లాండ్రీ యంత్రం కోసం మూడు నెలల క్రితం అధికారులు ప్రతిపాదించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించారు.
రూ.13 లక్షలతో ఏర్పాటు..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మైకనైజ్డ్ లాండ్రీ ఏర్పా టు కోసం అభివృద్ధి ప్రత్యేక నిధుల నుంచి కలెక్ట ర్ కోయ శ్రీహర్ష రూ.13 లక్షలు కేటాయించారు. ఇందులో రూ.8 లక్షలు మెకనైజ్డ్ యంత్రం కోసం వెచ్చించగా.. మిగిలిన నిధులతో షెడ్డు నిర్మించిన ట్లు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఆస్పత్రిని అన్ని విధాలా ఆధునికీకరిస్తున్నట్లు ఆ యన పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యేక చొర వతో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు మెరుగయ్యాయని, అన్నిరకాల వైద్యసేవలను స్థానికంగా అందిస్తున్నామని ఆయన వివరించారు. లాండ్రీ మిషన్‌ను ఎమ్మెల్యే విజయరమణారావు చేతు ల మీదుగా త్వరలో ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment