ప్రజాసమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ప్రజాపాలనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ ఠాకూరర్ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారుల కు సూచించారు. పాలకుర్తి గ్రామానికి చెందిన రవి తన తండ్రి కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడని, అదే ఉద్యోగం తనకు ఇప్పించాలని ఎమ్మెల్యే కు మొరపెట్టుకున్నాడు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్ట రీ మేనేజర్‌కు ఫోన్‌చేసి మాట్లాడిన ఎమ్మెల్యే.. ఉద్యోగం ఇప్పించాలని సూచించారు. దీంతో మే నేజర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కన్నాల గ్రామానికి చెందిన పలువురు నిరుద్యోగులు తమకు ఉపాధి చూపించాలని కోరగా స్థానిక మెడికల్ కళాశాలలతో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తేలేదు
అభివృద్ధి విషయంలో రాజీపడబోమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. లక్ష్మీనగర్ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మేదర్‌బస్తీ, ఉల్లిగడ్డ బజార్, అబ్దుల్‌కలాం విగ్రహం, కల్యాణ్‌నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వర సైకిల్ స్టోర్స్ వరకు చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, రోడ్డు పనులు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆయన వెంట నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, బొంతల రాజేశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment