లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
కోల్‌సిటీ(రామగుండం): స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని పీసీ, పీఎన్‌డీటీ(ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్) స్టేట్ మానిటరింగ్ కమిటీ స భ్యురాలు సూర్యశ్రీరావు, డీఎంహెచ్‌వో అన్న ప్రస న్న కుమారి హెచ్చరించారు. జిల్లాలోని గోదావరిఖని, ధర్మారంలోని స్కానింగ్ సెంటర్లను డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారితో కలిసి పీసీ, పీఎన్‌డీటీ స్టేట్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మంగళవా రం ఆకస్మింగా తనిఖీలు చేశారు. గోదావరిఖనిలో లోటస్ స్కానింగ్ సెంటర్‌తోపాటు విజయ ఫెర్టిలి టీ, ధర్మారంలోని శ్రీసూర్య ఆదిత్య నర్సింగ్ హోంలోని స్నానింగ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ధర్మారంలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్య క్తం చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చేసే ఆస్పత్రుల నిర్వాహకు లు లింగ నిర్ధారణ చేసినా, చట్ట విరుద్ధంగా గర్భస్రావాలు చేసినా జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment