యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్(45) రోడ్డుప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూగవాడైన శ్రీనివాస్.. మంగళవారం రాత్రి గోదావరిఖని – మంథని మధ్య రోడ్డుపై సుందిళ్ల శివారులో నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టగా, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి కటకం రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment