అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – నాగపూర్(అజ్నీ) మధ్య అజ్నీ ప్యాసింజర్ రైలు గురువారం నుంచి పట్టాలెక్కనుంది. ఈమేరకు రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా సమయంలో రైల్వేశాఖ అజ్నీ రైలును రద్దు చేయడంతో ఏళ్లుగా ప్రయాణికులు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలోపై గతనెలలో ‘సాక్షి’ ‘వినిపించని అజ్నీ’ కూత శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్.. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వీనివైష్ణవి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వినతిపత్రం అందజేసి సమస్య పరిష్కరించాలని వివరించారు. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే అజ్నీ ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని వారు పట్టుబట్టారు. దీంతో గురువారం నుంచి అజ్జీ ప్యాసింజర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. అజ్నీ మళ్లీ పట్టాలపైకి వస్తుందనే సమాచారంతో కాజీపేట– బల్హార్షా సెక్షన్ల మధ్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేటినుంచి పట్టాలెక్కనున్న రైలు
ఏళ్ల తర్వాత పునరుద్ధరణకు చర్యలు
ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వేశాఖ
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment