అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
సారంగాపూర్: అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. మండలంలోని రంగపేటకు చెందిన లలితకు 15 ఏళ్ల క్రితం తుమ్మల చిరంజీవితో వివాహమైంది. వీరికి కూతురు సంతానం. కొద్దిరోజులుగా లలితను భర్త చిరంజీవి, అత్తామమలు మరియా, కాంతయ్య శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఈనెల ఒకటో తేదీన పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.
ఉరేసుకుని వ్యక్తి ..
మల్లాపూర్: ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మొగిలిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి పురుషోత్తం (35)కు భార్య శరణ్య, ఇద్దరు కుమారులు వివేక్, ఆదిత్య ఉన్నారు. ఉపాధి కోసం దుబాయికి రెండుసార్లు వెళ్లి వచ్చాడు. ఇందుకు రూ.7లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక.. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు.
చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతి
వెల్గటూర్: చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జగదేవుపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.పాషా శుక్రవారం జగిత్యాలలో బైక్‌పై బైపాస్ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా బైక్‌పై వచ్చిన ముగ్గురు బాలురు ఢీకొట్టారు. గాయపడిన పాషాను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పాషా మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment