ఉల్లాసంగా.. ఉత్సాహంగా
గోదావరిఖని(రామగుండం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్‌లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. పిరమిడ్‌విత్ గ్లాస్, బాల్‌ఇన్ బాస్కెట్, లెమన్ ఇన్ స్పూన్, మ్యూజికల్ చెయిర్, సూదిలో దారం, త్రోబాల్, బాంబ్ ఇన్‌దిసిటి ఆటలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు మహిళ దినోత్సవం రోజున బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో సేవ అధ్యక్షురాలు అనిత, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సేవా జాయింట్ సెక్రటరీ బీనాసింగ్, సీనియర్ పీవోలు హనుమంతరావు, శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్‌రెడ్డి, సూపర్‌వైజర్ రమేశ్, సేవా కోఆర్డినేటర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
Comments
Please login to add a commentAdd a comment