ఇక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కనుమరుగే
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీకి అధికారం అప్పగించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పట్టణంలోని అమర్‌నగర్ నుంచి జెండా వరకు గురువారం విజయోత్సవర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయజెండా రెపరెపలాడేలా తీర్పునిచ్చిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసపూరిత పాలనతో విసిగి వేసారి పోయారన్నారు. దేశంలో మోదీ నీతివంతమైన పాలననే కోరుకుంటున్నారని, రాష్టంలోనూ బీజేపీ కే పట్టం కట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, పెంజర్ల రాకేశ్, రమేశ్, గనెబోయిన రాజేందర్, జంగ చక్రధర్‌రెడ్డి, రాజం మహంత, సదానందం, పర్శ సమ్మయ్య, శ్రీనివాసరావు, రమేశ్, నరేశ్, కుమార్, రవి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment