రామగుండం రైల్వేస్టేషన్‌లో అన్ని రైళ్ల హాల్టింగ్
రామగుండం/పెద్దపల్లిరూరల్: ఇండస్ట్రియల్ హబ్ రామగుండం రైల్వేస్టేషన్‌లో అన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తా మని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. రామగుండం రైల్వేస్టేషన్‌లో చేప ట్టిన అభివృద్ధి పనులు, పెద్దపల్లి రైల్వే వంతెన పనులను ఎంపీ శుక్రవారం పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం కరోనా నుంచి రద్దయిన బల్హార్షా –కాజీపేట రైలును పునరుద్ధరించామన్నారు. హైదరాబాద్ నుంచి హ జ్రత్ నిజాముద్దీన్ వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌కు రామగుండంలో హాల్టింగ్ పునరుద్ధరణ, గంగా కావేరి, నవజీవన్, మిలీనియం, తమిళనాడు తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దశల వారీగా హాల్టింగ్ కల్పించేందుకు చ ర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతినిధులు అనుమాస శ్రీనివాస్, గడ్డం మధు, కొంగర శ్రీనివాస్, మహ్మద్ అజీం, సాధిఖ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment