పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మాఫీకి గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మాఫీకి గ్రీన్‌సిగ్నల్‌

Published Sat, Mar 8 2025 1:24 AM | Last Updated on Sat, Mar 8 2025 1:24 AM

-

గోదావరిఖని: కోలిండియాలో అమలవుతూ సింగరేణిలో లేనిపెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ మాఫీకి సింగరేణి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. శుక్రవారం సీఎండీ బ లరాంతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధా న కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ హై దరాబాద్‌ స్ట్రక్చరల్‌ మీటింగ్‌లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అంగీకరించిన డిమాండ్లు..

● కార్మికులందరికీ వర్తించే పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ మాఫీకి సింగరేణి అంగీకరిస్తూనే ప్రత్యేక కమిటీ వేశారు.

● సొంతింటి పథకం అమలుకు యాజమాన్యం అంగీకరించింది. దీనిపై విధివిధానాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేశారు.

● హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రి ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. రిటైర్డ్‌ అయి హైదరాబాదులో ఉన్నవారికి ట్యాబ్లెట్లు సింగరేణి భవన్‌లో ఇచ్చేందుకు అంగీకరించారు.

● రిటైర్డ్‌ అయిన కార్మికులు కంపెనీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయినప్పటికీ 40శాతం కటింగ్‌ చేయరు.

● మెన్స్‌, డిపార్ట్‌మెంట్లలో కార్మికులకు లాకర్స్‌, కబోర్డ్స్‌, ఆఫీస్‌లో ఫ ర్నీచర్స్‌ మంజూరుకు అంగీకారం.

● సెక్యూరిటీ, హాస్పిటల్స్‌ సిబ్బంది, ఎలక్ట్రిషన్‌, ఫిట్టర్స్‌.. ఇలా అన్ని రకాల మజ్దూర్ల డిసిగ్నేషన్స్‌ జనరల్‌ మజ్దూర్‌ నుంచి జనరల్‌ అసిస్టెంట్‌ ట్రైనీగా ఇవ్వనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement