వనిత.. | - | Sakshi
Sakshi News home page

వనిత..

Published Sat, Mar 8 2025 1:28 AM | Last Updated on Sat, Mar 8 2025 1:25 AM

వనిత..

వనిత..

అన్నింటా ఘనత
‘సాక్షి’ గెస్ట్‌ ఎడిటర్‌గా వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
● ఉమెన్స్‌డే కథనాలను పరిశీలించి ఫైనల్‌ చేసిన ఏఎస్పీ ● కథనాల పరిశీలన.. ఎంపికపై పలు సూచనలు ● పత్రిక సిబ్బంది కృషి అభినందనీయమన్న ఐపీఎస్‌

ఆడపిల్ల పుట్టిందంటే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లను మహాలక్ష్మిగా కొలుస్తున్నారు. ఊర్లో.. అమ్మాయి పుడితే లక్ష్మీ వచ్చిందంటున్నారు. ఆమె ఒక తల్లి.. కూతురు.. సోదరి.. భార్య.. వీటన్నింటికీ మించి పోరాట యోధురాలు. ఆమె పుట్టుక ఆనందం. ఆమె ఓపికకు వందనం. ఆమె లేనిదే జననం లేదు. ఆమె లేనిదే జీవితం లేదు.. ఈ ప్రపంచానికి మనుగడే లేదు. అన్నింటా ఆమే.. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. చదువులో అగ్రస్థానంలో నిలుస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆవకాయ పెట్టడం నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా నారీ శక్తి కనిపిస్తోంది. కుటుంబానికి తోడుగా నిలుస్తూ.. కష్టాల్లో ఉన్న బతుకుబండిని లాగుతోంది. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనాలు.

పత్రికా సిబ్బంది శ్రమ తెలిసింది

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా గెస్ట్‌ ఎడిటర్‌గా కరీంనగర్‌ సాక్షి యూనిట్‌ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉంది. మనం ఉదయం చదివే దినపత్రికల కోసం 24 గంటలపాటు ఎన్నివ్యవస్థలు పనిచేస్తాయన్న విషయం ఈ రోజు ప్రత్యక్షంగా చూసే వీలుకలిగింది. వార్తల ఎడిటింగ్‌, ప్రాధాన్యం, పేజీనేషన్‌, ప్రాసెసింగ్‌, ప్రింటింగ్‌ తదితర అంశాలపై సిబ్బంది పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. ఈరోజు స్వయంగా వార్తలను ఎంపిక చేయడం, ఎడిటింగ్‌ చేయడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి సాక్షి పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

– శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ, వేములవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement