అదిరేటి స్టెప్పులు.. ఆకట్టుకున్న నృత్యాలు
కోల్‌సిటీ(రామగుండం): సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కాలేజీలో ‘కన్వాస్–25’ పేరిట శుక్రవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవం ఆకట్టుకుంది. డీజే సౌండ్స్‌తో మెడికోలు అదిరేటి స్టెప్పులు వేస్తూ కిర్రాక్ అనిపించారు. విద్యార్థులు సంప్రదాయ, వెస్ట్రన్ కల్చర్‌ను కలగలిపి అదరగొట్టారు. వేడుకల కోసం వారం రోజులపాటు మెడికోలు, ఫ్యాకల్టీలకు క్రీడా పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఈ) డాక్టర్ ఎ.నరేంద్రకుమార్, హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. వైద్య విద్యార్థులు రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, ప్రొఫెసర్లు అరుణ, ఓబులేశ్, అశోక్‌కుమార్, ఎస్సై భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment