అన్ని రంగాల్లో రాణించాలి
గోదావరిఖనిటౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక అదనపు జిల్లా న్యాయస్థానంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవనిలో సగంగా ఉన్న మహిళలు.. అవకాశాల్లో సగం అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. సీ్త్ర లేనిదే జననం లేదని, ఎక్కడైతే సీ్త్రలు పూజింపబడతారో అక్కడ భోగభాగ్యాలు విలసిల్లుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్, ఏజీపీ శంతన్‌కుమార్, సభ్యులు కిషన్‌రావు, సీహెచ్ శైలజ, పాత అశోక్, ఎస్.సంజయ్‌కుమార్, మహిళా ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment