అనుమతి లేకుండా మట్టి తరలింపు సరికాదు
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ శివారులో డంప్ చేసి, అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని బీఆర్‌ఎస్ కార్మిక సంఘం ప్రతినిధి కౌశిక హరి ఆరోపించారు. పార్టీ అనుచరులతో శనివారం మట్టి రవాణా చేసే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. హరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ నేతృత్వంలోనే టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్నారు. దానిని బడా వ్యాపారులకు విక్రయిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని, అయినా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మట్టి అక్రమ తరలింపును అధికారులు అడ్డుకోకుంటే తామే అడ్డుకుంటామని కౌశిక హరి హెచ్చరించారు.
సీఐటీయూ నేతల నిరసన
పెద్దపల్లిరూరల్: సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో శనివారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. జగిత్యాలలో ఆశ వర్కర్‌పై జరిగిన దాడి శోచనీయమన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేయడం సరికాదన్నారు. బాధిత మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. నాయకులు రవీందర్, సాగర్, సుశీల, పద్మ, కనకతార, రాజేశ్వరి, భూలక్ష్మి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డు నుంచి, జెడ్పీటీసీ స్థానం వరకూ పోటీచేసేందుకు నాయకులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు కందుల శ్రీనివాస్, కడారి అశోక్‌రావు, కొమ్ము తిరుపతి యాదవ్, రాజన్న పటేల్, మహేందర్ యాదవ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
10న అప్రెంటిషిప్ మేళా
రామగుండం: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో నిర్వహించే ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళాకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి శనివారం కోరారు. అప్రెంటిషిప్ మేళాలో తోషిబా, ఎల్‌అండ్‌టీ, జాన్సన్ లిఫ్ట్స్, ఇండియా టాటా, ఏరోస్పేస్, వరుణ్ మోటార్స్, ఆదర్శ మోటార్స్, రాణే ఇంజిన్ వాల్వ్స్, ఐటీసీ టెక్నాలజీ తదితర కంపెనీలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ధ్రువీకరణపత్రాలతో పదో తేదీ ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అనుమతి లేకుండా మట్టి తరలింపు సరికాదు
అనుమతి లేకుండా మట్టి తరలింపు సరికాదు
Comments
Please login to add a commentAdd a comment