లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
గోదావరిఖనిటౌన్: లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం సాధ్యమని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పగలు, ప్రతీకారాలతో డబ్బు, కాలాన్ని వృథా చేయకుండా ఇరువర్గాలు అంగీకారంతో కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
మంథని: మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మూల స్వాతి అన్నారు. పట్టణంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులు పరిష్కరించారు. అనంతరం పలు అంశాలపై జడ్జి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ అనురాధ, మంథని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రోఘోత్తంరెడ్డి, న్యాయవాదులు సుభాష్, విజయ్‌కుమార్, శశిభూషణ్ కాచే, భాగ్య, రాచర్ల రాజేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాజీ మార్గమే మేలు
పెద్దపల్లిరూరల్: కోర్డుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించడమే మేలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీనియర్ సివిల్‌కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మంజులతో కలిసి ఆమె పాల్గొన్నారు. పెద్దపల్లి కోర్టులో 756 కేసులు పరిష్కారమైనట్లు జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ అనిల్, బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌తో సమన్యాయం
సుల్తానాబాద్(పెద్దపల్లి): లోక్ అదాలత్‌లతో ఇరువర్గాలకు సమన్యాయం జరుగుతుందని జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్‌తో కేసులను పరిష్కరించుకోవచ్చని, తద్వారా, కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. సెకండ్ క్లాస్ స్పెషల్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడా ల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేశ్, ఏజీపీ దూడం ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment