
చెత్త సేకరణ అస్తవ్యస్తం
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని బల్దియాల్లో తడి, పోడి చెత్త సేకరణ లక్ష్యం నెరవేరడం లేదు. చెత్తను రోజూ వేరుచేసి సేకరించాల్సి ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి నుంచి రోజూ సుమారు 180 టన్నుల చెత్త వెలువడుతోంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలనే లక్ష్యంతో ప్రతీ ఇంటికి ఉచితంగా రెండేసి ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. చెత్త సేకరించే సైకిల్ రిక్షాలు మొదలుకొని ఆటో ట్రాలీల వరకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేలా ఏర్పాట్లు ఉన్నా.. అంతా కలిపి సేకరించడం సాధారణంగా మారింది. ట్రాక్టర్లకు మైకులు పెట్టి తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని అధికారులు ప్రచా రం చేస్తున్నా ఆచరణలో అమలు కావడంలేదు.
ప్రచారం సరే.. అమలు ఏది?
‘ప్రతిఒక్కరూ ఇంట్లోనే తడి, పొడి చెత్త వేరుచేయండి.. తడి చెత్తతో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో సేంద్రియ ఎరువు తయారు చేసుకోండి.. పొడి చెత్తను విక్రయించి అదనంగా ఆదాయం పొందండి.. మిగిలిన చెత్తన మాత్రమే ఆటో ట్రాలీలకు ఇవ్వండి’ అని మైకులతో హోరెత్తిస్తున్నారు. తడి, పొడి చెత్తను కలిపివేయడంతో కలిగే నష్టాల గురించి వివరిస్తూ చేసే ప్రచార హోరు, కాగితాల్లో లెక్క లు తప్ప ఆచరణలో ఎక్కడా వేర్వేరుగా సేకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
సమయానికి రాక.. రోడ్లపైనే పారబోత
చెత్త తరలించే వాహనాలు సమయానికి నివాసాలకు వెళ్లడంలేదు. దీంతో బల్దియాల్లో చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. అవగాహన లేకపోవడంతో తడి, పొడి చెత్త విభజన చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో తడి, పొడి చెత్త సేకరణ అమలు కావడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే బల్దియా అధికారులు స్పందిస్తున్నారు. కొన్ని వార్డులు, డివిజన్లలో రెండ్రోజులకోసారి చెత్త తరలించే వాహనం రావడంతో అప్పటివరకు ఇళ్లలోనే నిల్వ ఉంటోంది. చేసేది లేక స్థానికులు కాలనీలో రోడ్ల వెంట పారబోస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను సంప్రదించగా.. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా సిబ్బందికి ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తామని తెలిపారు.
తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉన్నా.. కలిపే సేకరిస్తూ.. డంపింగ్ యార్డుల్లో కాల్చివేస్తూ..
కాగితాల్లోనే వేర్వేరు సేకరణ ప్రక్రియ
అవగాహన లోపం, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
బల్దియాల్లో లోపిస్తున్న పారిశుధ్యం
ఈచిత్రంలో కాలిపోతున్న చెత్త రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నదీతీరంలో ఉన్న డంపింగ్‌యార్డులోనిది. మొత్తం 50 డివిజన్ల రోజూ 83 వాహనాల్లో సుమారు 118 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెందిన ఖాళీస్థలాల్లో వేస్తున్నారు. తద్వారా ఇంటివద్దే తడి, పొడి చెత్త వేర్వేరు సేకరణ ప్రక్రియ అమలు కావడం లేదు. ఇలా సేకరించిన తడిపొడి చెత్తను డంప్‌కార్డులో కుప్పగా పోసి తగలబెడుతున్నారు.
ఇవి తడి, పోడి చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన త్రిబుల్ డస్ట్‌బిన్‌లు. రామగుండం కార్పొరేషన్ పరిధి మార్కండేయకాలనీ తగర వీధిలోనివి. తడి, పొడి, హానికరమైన చెత్తను ఆ డబ్బాల్లో వేయాల్సి ఉంది. అవగాహనలేక స్థానికులు నిర్లక్ష్యంతో మొత్తం చెత్తను డబ్బాల్లో నింపుతున్నారు. సిబ్బంది సైతం చెత్తను డంపింగ్‌యార్డుకు అలాగే తరలిస్తున్నారు.

చెత్త సేకరణ అస్తవ్యస్తం

చెత్త సేకరణ అస్తవ్యస్తం
Comments
Please login to add a commentAdd a comment