
సీఐఎస్‌ఎఫ్ సేవలు భేష్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ భద్రతకు సీఐఎస్‌ఎఫ్ అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నా యని రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత ప్రశంసించారు. మల్కాపూర్ రోడ్డులోని సీఐఎస్‌ఎఫ్ బ్యారక్స్‌లో సోమవారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఆయన భద్రతా దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి మా ట్లాడారు. దేశభద్రత, కీలకఆస్తుల రక్షణలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అమోఘమన్నారు. కార్యక్రమంలో సీనియర్ కమాండెంట్ ముఖేష్‌కుమార్, ఎన్టీపీసీ అధికారులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బల్దియాలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రా రంభమైంది. జోన్‌కు ఒక డివిజన్ చొప్పున రో జూ 12 డివిజన్లలో ఈ కార్యక్రమం నిర్వహి స్తారు. కలెక్టర్, ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు కమిషనర్ (ఎఫ్‌ఏసీ) అరు ణశ్రీ పర్యవేక్షణలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. చెత్త కుప్పలను తొలగించడం, మురుగునీటి కాలువల్లో పూడిక తీయడం తదితర పనులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14వ తే దీ వరకు పారిశుధ్య పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పనులు తనిఖీ చేశారు.
జాతీయ పోటీల్లో ప్రతిభ
మంథని: పట్టణానికి చెందిన సిటోరియో కరా టే విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ని ర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్ర తిభ కనబర్చినట్లు ఇన్‌స్ట్రక్టర్ కావేటి సమ్మయ్య తెలిపారు. సబ్ జూనియర్ కుమితే విభాగంలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారన్నారు. బండారి మణికంఠ, ఎం.శివ, బాసాని మనోహర్, అక్షిత బంగారు, మనస్వి, అద్వితి వెండి, సహస్ర, మనోజ్ఞ కాంస్య పతకాలు సాధించిన వారిలో ఉన్నారని వివరించారు.
క్వింటాలు పత్తి రూ.6,913
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,913 ధర నమోదైందని మార్కెట్ కమిటీ కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్ట ధర రూ.5,016, సగటు ధర రూ.6,611గా నమోదైందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 202 మంది రైతుల నుంచి 746 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎఫ్‌ఎల్‌ఎన్ జిల్లా రిసోర్స్ పర్సన్ రవి సూచించారు. ఉపాధ్యాయులు చతుర్విద ప్రక్రియల ద్వారా విద్యాబోదన చేయాలన్నారు. ఊశన్నపల్లె ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, రికార్డులు పరిశీలించారు. వ్యక్తిగత పరిశీలనతోనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచవచ్చని తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సునీత, స్కూల్ హెచ్‌ఎం సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత, సురేశ్, కుమార్, శ్రీవాణి ఉన్నారు.
‘పట్టు’తో రైతులకు లాభాలు
జూలపల్లి(పెద్దపల్లి): పట్టు పురుగుల పెంపకంతో రైతులకు అధిక లాభాలు వస్తాయని పరిశోధన కేంద్రం రీజినల్ సెరికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ వినో ద్‌కుమార్ అన్నారు. జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శివారు రైతువేదికలో సోమవారం పట్టురైతు దినోత్సవం నిర్వహించారు. పట్టు పరిశ్రమ అధికారులు పట్టు పురుగుల పెంపకం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించా రు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాఘవేంద్ర, అధికారి తిరుపతిరెడ్డి, సూపరింటెండెంట్ దాసు, మండల అధికారి మహేశ్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

సీఐఎస్‌ఎఫ్ సేవలు భేష్

సీఐఎస్‌ఎఫ్ సేవలు భేష్
Comments
Please login to add a commentAdd a comment