ముగ్గు పోస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి: పేదల దశాబ్దాల సొంతింటి కల సాకారమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనలు పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గతఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పేదల సొంతింటి కల నెరవేర్చుతామని, ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇ స్తామని ప్రకటించారు. అంతేకాదు.. తమ ఎన్నిక ల మేనిఫెస్టోలోనూ చేర్చి ప్రచారం విస్తృత పర్చారు.
తొలుత మోడల్ ఇళ్ల నిర్మాణం..
జిల్లాలో తొలుత మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, ఓదెల మండలంలోని శాన కొండ, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి, పెద్దపల్లిలోని నిమ్మనపల్లి గ్రామాల్లో మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముగ్గు పోస్తున్నారు.
అద్దె కొంపలు.. అనేక అవస్థలు
జిల్లాలోని వేలాది పేద కుటుంబాలు ఇంకా అద్దె కొంపల్లోనే అసౌకర్యాల మధ్య కాలం వెళ్లదీస్తున్నా యి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,91,836 ఉండగా, ఇందులో 3,97,585 మంది పురుషులు, 3,94,251 మంది మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, 13 మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోంచి తమకు ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ ప్రజాప్రజాలన సభలు, ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి 1,80,564 దరఖాస్తులు అందాయి.
భారంగా బతుకులు..
పల్లెల్లోనూ ప్రస్తుతం ఒక బెడ్రూమ్ ఇంటి అద్దె కనీసం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతోంది. అయినా, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంటగదులు, నీటి సౌకర్యం సరిగా ఉండడంలేదు. మున్సిపాటీల్లో ఇదే ఇంటికి రూ.5వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె పలుకుతోంది. ఇక్కడా ఇరుకు గదులు, అసౌకర్యాలు, నీటి వసతి ఉండడంలేదు. ఇక గోదావరిఖనిలో అయితే, సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. అపార్ట్‌మెంట్లలో అయితే ఇంతకు రెట్టింపు పలకడంతో పేదలు, సామాన్యులు ఆ ఇళ్లలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో స్లమ్ ఏరియా ల్లోని అరకొర వసతులు ఉన్నా సర్దుకు పోతున్నారు. కూలీనాలీ పనులు చేసుకునే రోజూవారీ కూలీలు.. నెలకు సంపాదించే ఆదాయంలో అగ్రభాగం ఇంటి అద్దెకే వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు.
నియోజవర్గానికి 3,500 ఇళ్ల కేటాయింపు..
తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కేటాయించే 10,500 ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలు తలదాచుకునేందుకు ఆశ్రయం లభిస్తుందనే గంపెడాశతో ఎదురు చూస్తున్నాయి. జిల్లాకు తొలిదశలో గత జనవరి 26వ తేదీన 1,708 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 800 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వానికి 1,80,564 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరిస్తున్నారు.
ప్రయోగాత్మక గ్రామాల్లో లబ్ధిదారులు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు
లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్న ప్రారంభోత్సవాలు
జిల్లాకు 10,500 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు
ఇప్పటివరకు 800 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ
మద్దిర్యాల 59
బంజేరుపల్లి 71
శివపల్లి 08
కోనరావుపేట 140
రొంపికుంట 170
అడవి సోమన్పల్లి 180
మచ్చుపేట 20
శానగొండ 200
రామారావుపల్లి 110
నిమ్మనపల్లి 130
రత్నాపూర్ 290
అంకంపల్లి 110
కాట్నపల్లి 120
Comments
Please login to add a commentAdd a comment