
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జూలపల్లి(పెద్దపల్లి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. వడ్కాపూర్, కాచాపూర్, వెంకట్రావు పల్లె, కీచులాటపల్లె, కుమ్మరికుంట గామాల్లో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాక మాట్లాడారు. ధాన్యంలో కోతలు విధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో ప్రత్యూష, ప్యాక్స్ చైర్మస్ వేణుగోపాలరావు, నాయకుడు నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యంతో చదివితేనే గుర్తింపు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): విద్యార్థులు ఉ న్నత లక్ష్యంతో చదివితేనే మంచిగుర్తింపు లభించడంతోపాటు భవిష్యత్ బాగుంటుందని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి మో డల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియేట్ పరీక్ష ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. వారిని ఎమ్మె ల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సి పాల్ గోల్డీ బల్బీర్‌కౌర్, అధ్యాపకులు ఉన్నారు.
● ఎమ్మెల్యే విజయరమణారావు