అలాంటి వారితో దేశం ఏం బాగుపడుతుంది?
వికారాబాద్, వనపర్తి బీజేపీ సభల్లో అమిత్ షా ఫైర్
మోదీ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రమూకలను మట్టుబెట్టారు
రాహుల్, రేవంత్‌రెడ్డిలు కాకులను కూడా కాల్చలేరు!... కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది
ఫేక్ వీడియోలు పెట్టించిన రేవంత్ మూల్యం చెల్లించుకోక తప్పదు
వికారాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరవుతారో ఎవరైనా చెప్పగలరా? మమతా బెనర్జీయా, శరద్ పవారా? స్టాలినా? ఉద్దవ్ ఠాక్రేనా? లేక రాహుల్ బాబా ప్రధాని అవుతారా? అది వారికే తెలియదు. అలాంటి వారితో దేశమేం బాగుపడుతుంది..’’అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్‌తో మోదీ క్రూర ఉగ్రమూకలను మట్టుబెడితే.. ఈ రేవంత్‌రెడ్డి, రాహుల్ బాబాలు కాకులను కూడా కాల్వలేరని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్, వనపర్తిలలో నిర్వహించిన బీజేపీ సభల్లో ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ నాయకులు ప్రియాంక, రాహుల్ బాబాలకు మైనార్టీల ఓట్లు కావాలి.. అందుకే వారి భజన చేస్తున్నారు. అందుకే బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీయే. ముస్లింలకు మతపరంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిది. బీజేపీని గెలిపిస్తే ఆ రిజర్వేషన్లను తీసేస్తాం. హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.
కాంగ్రెస్‌ది చైనీస్ గ్యారంటీ!
నరేంద్ర మోదీ గ్యారంటీ అంటే.. అది పూర్తి చేసే గ్యారంటీ.. కాంగ్రెస్ గ్యారంటీ అంటే చైనీస్ గ్యారంటీ. అది ఉత్త డొల్ల, పూర్తికాదు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చారు. కాంగ్రెస్ దళిత, ఆదివాసీ, ఓబీసీల సంపదను దోచుకుంటోంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రైతులకు ఏటా రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ఆ హామీలేవీ నెరవేర్చలేదు. రేవంత్‌రెడ్డి ఫేక్ వీడియోలతో తప్పుడు స్థలంలో చేయి పెట్టారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది. కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది.
పీఓకేను స్వా«దీనం చేసుకుంటాం
కశ్మీర్ భారత్ సొంతం. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ అంశాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. మోదీ వ చ్చిన పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్‌ను భారత్ వశం చేశారు. ఈసారి అధికారమిస్తే పాక్ ఆక్రమిత కశీ్మర్‌ను స్వా«దీనం చేసుకుంటాం. ఈసారి ఎన్నికల్లో బీ జేపీ గెలుపు ఖాయం. రాహుల్‌గాంధీ కొంత కా లం కింద భారత్ జోడో యాత్ర చేశారు. మరికొద్ది నెల ల్లో మాయమైపోయే కాంగ్రెస్ పార్టీని వెతికే యాత్ర చేయాలి..’’అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment