లోకేశ్‌ ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ: మంత్రి కన్నబాబు | AP Minister Kannababu Fire On Nara Lokesh Drama Politics | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ: మంత్రి కన్నబాబు

Published Thu, Sep 9 2021 3:38 PM | Last Updated on Thu, Sep 9 2021 6:40 PM

AP Minister Kannababu Fire On Nara Lokesh Drama Politics - Sakshi

సాక్షి, అమరావతి: తనయుడు లోకేశ్‌ ఎలా అల్లరి చేయాలో తండ్రి చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నట్లుందని మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏడు నెలల కిందట జరిగిన సంఘటనలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిదో అందరికీ తెలుసని పేర్కొన్నారు. వాళ్లకి ప్రజలపై ప్రేమ లేదు.. తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేశ్‌ నటిస్తున్నాడని కన్నబాబు విమర్శించారు. మహిళల భద్రతలో ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీడీపీలో కూడా లోకేశ్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పారు. అందుకే ఇలాంటి డ్రామాలు అని పేర్కొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదం జరిగితే తమ నాయకుడు వెళితే కేసులు పెట్టింది ఏ ప్రభుత్వం..? రన్ వేపై నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు..? ఏం తప్పు చేశారని ఆ రోజు కాపులు కంచాలు కొట్టారని వేల మందిపై కేసులు పెట్టారు..? అని నిలదీశారు. 

చదవండి: పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్‌ నిర్మాణం పూర్తి

ప్రజాస్వామ్య పద్ధతిన జరుగుతున్న పరిపాలన వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. రాజకీయంగా లోకేశ్‌ని టీడీపీలో యాక్సెప్టెన్సీ కోసం ఈ డ్రామాలన్నీ అని మంత్రి కన్నబాబు తెలిపారు. అంతకుముందు  వ్యవసాయ శాఖ అభివృద్ధిపై కన్నబాబు మాట్లాడుతూ.. ‘గ్రామ స్థాయి వరకు బ్యాంకింగ్ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. దానికి కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రం పురోగతి సాధించడానికి బ్యాంకర్స్ సహకారం బాగుందని సీఎం చెప్పారు. ఇతర రాష్ట్రాలకంటే సమర్థంగా పని చేసిందని జీడీపీ తెలుపుతోంది. 10.49 శాతం పంటరుణాలు అధికంగా ఇచ్చాం. 

కౌలు రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక విధానం తేవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి రుణ పరపతి కల్పించాలని సీఎం కోరారు. 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాన్డెంట్స్ నియామకం చేయాలని సీఎం కోరారని, ఇప్పటికే 6 వేల మందిని నియమించాం. ఆర్బీకేలు బ్యాంకింగ్ సేవల అనుసంధానం పూర్తయితే సంపూర్ణమైన డిజిటలైజ్ జరుగుతుంది. ఎంఎస్‌ఎంఈలకు పూర్తిగా సహకరించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం జగన్ కోరారని, అత్యధిక ఉద్యోగ కల్పన ఈ రంగమే ఇస్తుందని, దాన్ని ప్రోత్సాహించాలని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు కన్నబాబు తెలిపారు. 

చదవండిఏపీ: నాలుగు లక్షలు దాటిన జీఎస్టీ ట్రేడర్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement