ఆ మార్పుల ప్రచారం కేసీఆర్‌ కుట్ర  | Bandi Sanjay comments over kcr | Sakshi
Sakshi News home page

ఆ మార్పుల ప్రచారం కేసీఆర్‌ కుట్ర 

Published Thu, Jun 29 2023 2:59 AM | Last Updated on Thu, Jun 29 2023 2:59 AM

Bandi Sanjay comments over kcr  - Sakshi

సికింద్రాబాద్‌: బీజేపీ రాష్ట్ర కమిటీలో మార్పులు చేస్తారన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. రాష్ట్ర పారీ్టలో నాయకత్వ మా ర్పులు జరుగుతాయని, మంత్రి వర్గంలో కూర్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారం వెనుక సీఎం కేసీఆర్‌ కుట్ర ఉందని ఆయన విమర్శించారు. భోపాల్‌ పట్టణంలో జరిగిన ‘మేరా బూత్‌ సబ్‌సే మజ్బూత్‌’కార్యక్రమానికి హాజరైన 600 మంది కార్యకర్తలు తిరిగి బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరికి స్వాగతం పలికేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చిన బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్‌.. తన పార్టీ పనులు పక్కనబెట్టి ఇతర పార్టీల్లో గందరగోళం సృష్టించే మూర్ఖుడని అభివర్ణించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు, జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తెలియకుండా తమ పార్టీలో మార్పుల గురించి మీడియాల్లో కథనాలు రావడం విచారకరమన్నారు. అన్ని రాష్ట్రాల నాయకులతో సమావేశాల్లో భాగంగా.. వచ్చే నెలలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని సంజయ్‌ తెలిపారు.

తమ పార్టీ నేత ఈటల రాజేందర్‌ను హత్య చేయడానికి కుట్రపై పూర్తిస్థాయి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆయనకు అవసరమైన భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, జె.సంగప్ప, శ్యాంసుందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement