
ఫైల్ ఫోటో
సాక్షి, కరీంనగర్: భాగ్యనగరంను ఎంఐఎంకు ధారాదత్తం చేసేందుకు అధికారి పార్టీ టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పినా టీఆర్‌ఎస్‌కు బుద్దిరాలేదని విమర్శించారు. ఎంఐఎంకు మేయర్ పదవి కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందన్నారు. 63 డివిజన్‌లలో హిందువుల ఓట్లు తగ్గించి మైనార్టీ ఓట్లు పెంచారని చెప్పారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి కానీ అలా జరగలేదన్నారు. (చదవండి: సంక్రాంతికి ‘జీహెచ్‌ఎంసీ’ గిఫ్ట్ ఇస్తారు..)
రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం చెబితే టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ చెబితే ఎన్నికల సంఘం వింటుందన్నారు. ఎంఐఎంకు మేయర్ పదవి దక్కుండా చూస్తామని, బీజేపీ 100 స్థానాల్లో గెలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ల నుంచి భాగ్యనగరాన్ని కాపాడుకుంటామని, బీహార్‌లో ఎంఐఎం 5 ఆసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారన్నారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం విస్తరించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, హిందువుల పండగల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతోంది ఆయన అన్నారు. దీపావళికి టపాసులు కాల్చకుండా నిషేధించడం హిందువుల పండగలను చూలకన చేయడమే అని బండి సంజయ్ పేర్కొన్నారు. (చదవండి: హైదరాబాద్‌ను ఏం చేద్దాం అనుకున్నారు..)
Comments
Please login to add a commentAdd a comment