వదినకు రూ.35 లక్షలు బాకీ.. ప్రత్యర్థుల రుణానుబంధం! | Baramati MP Supriya Sule owes rs 35 lakh to Sunetra | Sakshi
Sakshi News home page

వదినకు రూ.35 లక్షలు బాకీ.. ప్రత్యర్థుల రుణానుబంధం!

Published Fri, Apr 19 2024 1:34 PM | Last Updated on Fri, Apr 19 2024 3:28 PM

Baramati MP Supriya Sule owes rs 35 lakh to Sunetra - Sakshi

పుణె: బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇక్కడి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్‌ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తన వదిన, ప్రస్తుత ఎన్నికలలో తన ప్రత్యర్థి సునేత్రా పవార్‌కు రూ. 35 లక్షలు బాకీ ఉన్నారు. అలాగే మేనల్లుడు పార్థ్ పవార్‌కు రూ. 20 లక్షలు అప్పున్నారు.

తాజాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వివిధ సంస్థలు, వ్యక్తులకు చెల్లించాల్సిన అప్పుల వివరాలను సుప్రియా సూలే పేర్కొన్నారు. అదే రోజున ఆమె ప్రత్యర్థి, ఎన్‌సీపీ అజిత్‌ వర్గం అభ్యర్థి సునేత్ర పవార్‌ సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఈ వివరాలు ప్రతిబింబించాయి. సుప్రియా సూలేకి రూ.35 లక్షలు, ఆమె తల్లి, శరద్ పవార్ సతీమణి అయిన ప్రతిభా పవార్‌కి రూ.50 లక్షలు రుణం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

ఎలక్షన్‌ అఫిడవిట్‌ల ప్రకారం... సుప్రియా సూలే ఆస్తుల విలువ రూ.43.51 కోట్లు కాగా, ఆమె భర్త మొత్తం ఆస్తులు రూ.131 కోట్లుగా ఉన్నాయి. ఇక సునేత్ర పవార్‌ రూ. 70.95 కోట్ల విలువైన మొత్తం సంపదను వెల్లడించగా, ఆమె భర్త, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ.50.40 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. సుప్రియా సూలే వ్యాపారవేత్త సదానంద్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement