మోదీ, అమిత్ షాలను కించపరిచేలా మాట్లాడుతున్నారు
సీఈఓకు ఫిర్యాదు చేసిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై నిషేధం విధించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రచార సభలు, మీడియా సమావేశాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కించపరిచేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతోపాటు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకొచి్చంది. వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణల ద్వారా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, ఎన్నికల ప్రచారంలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా రేవంత్‌రెడ్డి దు్రష్పచారం చేస్తున్నారని పేర్కొంది.
ఇటీవల సిద్ధిపేటసభలో అమిత్‌షా చేసిన ప్రసంగ వీడియోను మార్ఫింగ్ చేసి ఆయనతోపాటు, మోదీ వ్యక్తిత్వానికి భంగం కలిగించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అమిత్‌షా మాటలను మారి్ఫంగ్ చేసిన వీడియోపై సైబర్ క్రైంస్టేషన్‌లో బీజేపీ కేసు నమోదు చేయించగా, దానిపై విచారణ సాగుతోందని తెలిపింది. అయితే దీనిని కూడా తప్పుదారి పట్టించేలా, మళ్లీ తాజాగా నిజామాబాద్ సభలో మోదీ, అమిత్‌షాలను కించపరిచేలా రేవంత్‌రెడ్డిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఈఓ దృష్టికి తెచి్చంది.
రిజర్వేషన్ల రద్దుపై మోదీ, అమిత్‌షాలను తాను ప్రశ్నించడం వల్ల తనపై కేసులు పెడుతున్నారంటూ రేవంత్‌రెడ్డి మారి్ఫంగ్ వీడియో అంశాన్ని ప్రస్తావించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. తాను రిజర్వేషన్ల రద్దుపై పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందున హోంశాఖ తనను అరెస్ట్ చేయాలని కోరుకుంటోందని రేవంత్‌రెడ్డి నిజామాబాద్ సభలో, హైదరాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడారని తెలిపింది. ఈ వీడియోను కూడా తమ ఫిర్యాదుతో జతచేసినట్టు వెల్లడించింది.
రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆధారరహితమైనదని, దీనివల్ల దేశంలో అశాంతి చెలరేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డిపై చర్యలు చేపట్టడంలో భాగంగా...మళ్లీ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలని కోరింది. బీజేపీనేత ఎన్.రామచందర్‌రావు పారీ్టనేతలు గోకుల రామారావు, ఆంథోనిరెడ్డి శుక్రవారం సీఈను కలిసి వినతిపత్రం సమరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment