తుక్కుగూడ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ.. అప్‌డేట్స్
►ఇలాంటి అసమర్థ సీఎంను జీవితంలో చూడలేదు: అమిత్ షా
ఇలాంటి అసమర్థ సీఎంను తన జీవితంలో చూడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కేసీఆర్‌ను, మజ్లిస్‌ను గద్దె దించిననాడే తెలంగాణకు విమోచన అని అమిత్ షా పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్‌ను మజ్లిస్‌ను చూసి భయపడే ప్రసక్తే లేదన్నారు.
► కేసీఆర్‌ను గద్దెదించకపోతే తెలంగాణకు శ్రీలంక పరిస్థితి: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తుక్కుగూడ సభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ.. పాదయాత్రలో స్వయంగా అనేక సమస్యలు చూశానన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూఠీ చేస్తోంది. పంచభూతాలను సైతం వదలడం లేదు. హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఒకే కుటుంబం పాలించిన శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో చూడండి. కీలక శాఖలన్నీ కల్వకుటుంబం కుటుంబం చేతుల్లోనే ఉంది. కేసీఆర్ పాలన పోకపోతే మనకూ శ్రీలంక పరిస్థితే దాపురిస్తుంది. తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం కోసమే ప్రజా సంగ్రామ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచే ప్రసక్తే లేదు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం అన్నారు ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎంఐఎంలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తాం. పేదలందరికీ ఇళ్లు ఇస్తాం.
► తెలంగాణ రావాలంటే కల్వకుంట్ల పర్మిషన్ అవసరమా?: కిషన్‌రెడ్డి
బీజేపీ బరాబర్ తెలంగాణకు వస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ వైఫల్యాన్ని, బీజేపీ చైతన్యాన్ని సభ ద్వారా తెలియజెప్పాలని ఆయన అన్నారు. అమిత్ షా ఎందుకొస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ పర్మిషన్ అవసరమా? వాళ్లకేమైనా రాసిచ్చామా? అని నిలదీశారు కిషన్‌రెడ్డి. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో.. ఉద్యమకారులకు, ప్రజలకు, బీజేపీకి అంతే హక్కు ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో తెలంగాణలోని గ్రామాలకు కేంద్రం నిధులు ఇచ్చిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు.
► తుక్కుగూడ సభకు చేరుకున్న అమిత్ షా. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇతర కీలక నేతలతో వేదికపైకి చేరిక. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసిన అమిత్ షా
► కేసీఆర్ ప్రభుత్వం అన్నింటా విఫలం: ఈటల
దేశంలోనే అప్పుల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణలోని ఏ గ్రామంలో చూసినా మద్యం షాపులే కనిపిస్తున్నాయని, అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
► తుక్కుగూడ సభా స్థలికి చేరుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ కీలక నేత అమిత్ షాతో పాటు ప్రసంగించనున్న బండి సంజయ్.
► ఇంకా నోవాటెల్‌లోనే అమిత్ షా.. కిషన్‌రెడ్డి, తరుణ చుగ్‌తో భేటీ
► బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు. సభా ప్రాంగణమంతా కాషాయమయం.
► కాసేపట్లో తుక్కుగూడ సభకు బీజేపీ నేత అమిత్ షా.
► అమిత్ షాతో ముగిసిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ భేటీ. తెలంగాణలో బీజేపీ పరిస్థితిని వివరించిన నేతలు.. పార్టీకి దిశానిర్దేశం చేసిన అమిత్ షా.
► నోవాటెల్‌కు చేరుకున్న అమిత్ షా. కాసేపట్లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీ.
► రామాంతాపూర్ నుంచి బయలుదేరిన అమిత్ షా.
► దేశవ్యాప్తంగా ఉన్న 7 ఫోరెన్సిక్ ల్యాబోరేటరీలో హైదరాబాద్ ఒకటి. షా తో పాటు సెంట్రల్ డిటెక్టివ్ ఇనిస్టిట్యూట్‌లో కలియ తిరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
► హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. రామాంతాపూర్‌లో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ప్రారంభించిన అమిత్ షా. అనంతరం సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలించారాయన.
► తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది: అమిత్ షా
హైదరాబాద్‌లోని CFSL క్యాంపస్‌లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించేందుకు నేడు తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నాను.
— Amit Shah (@AmitShah) May 14, 2022
► నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీని ప్రారంభించి.. సాయంత్రం జరగబోయే బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
► శనివారం మధ్యాహ్నాం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అమిత్ షాకు.. కిషన్‌రెడ్డి, ఈటల, డీకే అరుణ, లక్ష్మణ్, విజయశాంతి, వివేక్ వెంటకస్వామి, తదితరులు ఘన స్వాగతం పలికారు.
► తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment