సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పేరును ‘‘బీజే..ఈసీ–సీబీఐ–ఎన్‌ఐఏ–ఐటీ–ఈడీ ... పి’’గా మార్చుకుంటే బాగుంటుందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ కన్నా ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తోందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కంటే ముందుగానే వారి పేర్లు ప్రకటిస్తోందని విమర్శించారు.
Before "EC"
— KTR (@KTRTRS) October 2, 2022
BJP announces
The Poll Dates!
Before "ED"
BJP announces
The Names!
Before "NIA”
BJP announces
The Ban!
Before "IT”
BJP announces
The Amount!
Before "CBI"
BJP announces
The Accused!
Appropriately BJP should rename itself as;
"BJ...EC-CBI-NIA-IT-ED...P" pic.twitter.com/ZvwFlJW03w
అలాగే ఎన్‌ఐఏ కంటే ముందే నిషేధం ప్రకటించారని, ఐటీ అధికారుల కంటే ముందుగానే నగదు ప్రకటిస్తున్నారని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు చెబుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ 15లోగా వస్తుందని, ఐదంచెల వ్యూహంతో గెల వాలని బీజేపీ స్టీరింగ్ కమిటీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ట్యాగ్ చేశారు.
చదవండి: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే చంపాలని అనిపిస్తోంది..!
Comments
Please login to add a commentAdd a comment