![BRS KTR Satirical Comments On Revanth and Congress](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/5/KTR_Revanthreddy_1.jpg.webp?itok=Cxv1BXR4)
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇదే సమయంలో రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
మోసానికి మారు పేరు కాంగ్రెస్
ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్
రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్
రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం
ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం.
అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం
రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం
ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు
సిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు.. మోసగాళ్ల బెదిరింపుల మేళా
అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్.. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అంటూ కామెంట్స్ చేశారు.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
మోసానికి మారు పేరు కాంగ్రెస్
ధోకాలకు కేరాఫ్… pic.twitter.com/oE7ziV5UlI— KTR (@KTRBRS) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment