కష్టపడింది కేసీఆర్‌.. క్రెడిట్‌ కాంగ్రెస్‌ది: హరీష్‌రావు | BRS MLA Harish Rao Political Counter To Congress | Sakshi
Sakshi News home page

కష్టపడింది కేసీఆర్‌.. క్రెడిట్‌ కాంగ్రెస్‌ది: హరీష్‌రావు

Published Mon, Aug 12 2024 3:56 PM | Last Updated on Mon, Aug 12 2024 7:27 PM

BRS MLA Harish Rao Political Counter To Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్‌ నిర్మిస్తూ.. కాంగ్రెస్‌ క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తో​ందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని.. ప్రాజెక్టును తామే కట్టినట్లు కలరింగ్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం కాంగ్రెస్‌ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించింది కేసీఆర్‌. ఆయన నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది. ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీనే నిర్మించినట్టు ఫుల్‌ కలరింగ్‌ ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మేము చేసిన అభివృద్ధిని తాము చేసినట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి.. బీఆర్‌ఎస్‌ నిర్మించిన ప్రాజెక్ట్‌ను రేవంత్‌ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ను కట్టింది కేసీఆర్‌ అని చెప్పారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ కట్టిందని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement