
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే అమలు చేస్తామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు." అని ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024లో అమిత్ షా మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ లేదని, మళ్లీ ప్రతిపక్ష బెంచీలపై కూర్చోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రహించినట్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశాం.. కాబట్టి దేశ ప్రజలు బీజేపీని అశీర్వదిస్తారని అన్నారు.
జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి), మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు.. కుటుంబ నియంత్రణకు పరిధి ఉంది.. కానీ రాజకీయాల్లో కాదు. మరిన్ని పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉందని సూచించారు.
ఇదీ చదవండి: Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు జేపీ నడ్డా దూరం?
Comments
Please login to add a commentAdd a comment