చిలకలగూడ: అధిష్టానం ఆదేశిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగులూరి సాయిబాబా అన్నారు. చిలకలగూడ సాయిలత ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టానని, ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని, వేరొకరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే వ్యక్తిగా స్థానికుడైన నాగులూరి సాయిబాబా అన్నివర్గాల ప్రజలకు సుపరిచితుడని గ్రేటర్ హైదరాబాద్ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు అచ్యుత రమేష్ బాబు అన్నారు.
కార్యక్రమంలో ఎస్‌సీ సెల్ ప్రతినిధులు దేవుడు వెంకటేష్, ప్రవీణ్‌కుమార్, కమలాకర్, అరుణ్‌కుమార్, రాజు, కాంగ్రెస్ నాయకులు తుమ్మశ్రీను, సతీష్, ప్రమోద్, ఆంజనేయులు, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment