
సాక్షి, హుజూర్‌నగర్: స్వతంత్ర భారతదేశంలో ఎ వరూ చేయనంతగా సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వేరే పార్టీలలో గెలి చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని తుంగతో తొక్కిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. శని వారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు.
దేశంలో బలపడిన ప్రజాస్వామ్య సంస్థలైన లెజిస్లేచర్, ప్రెస్, జ్యుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ సంస్థల పట్ల కించపరిచే వైఖరితో, రాజ్యాంగ సంస్థలను తొక్కిపారేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇంత విలాసవంతమైన జీవితం ఈ స్వతంత్ర భారతదేశం లో మరో సీఎంకు లేదని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను ఒకప్పుడు స్టీల్ స్ట్రక్చర్ అనేవారని, పద్ధతి ప్రకారం ఉండే ఐఏఎస్, ఐపీఎస్‌లను పక్కన పెట్టడం.. పూర్తిగా తొత్తులుగా మారిన వారిని అందలం ఎక్కించడం సీఎం కేసీఆర్ తప్ప ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును అనుభవిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనడం ఆయన అహంకార వైఖరిని తెలియజేస్తోందని అన్నారు.