
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి.. నియోజకవర్గాలకు వెళ్లాలన్నారు. తాను ఎక్కడ పోటీ చేయాలనేది సోనియా నిర్ణయిస్తారని ఉత్తమ్ తెలిపారు.