
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యేగా అనర్హత కేసులో సుప్రీంకోర్టులో ఊరట పొందిన బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు బుధవారం సీఎం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. తొలుత మంగళవారం సాయంత్రమే ప్రగతిభవన్‌లో చ్చింను తన కుమారుడు రామకృష్ణతో పాటు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
సీఎం సూచన మేరకు తిరిగి బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వెళ్లిన వనమా వెంకటేశ్వరరావు చ్చింతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ స్థితిగతులను వనమా వివరించినట్లు సమాచారం. ఇటీవల వనమాను హైకోర్టు ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. కేసు విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలు వాయిదా వేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతి వాదులకు రెండు వారాలు గడువిచ్చింది. చ్చింతో జరిగిన భేటీలో హైకోర్టు, సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను, నియోజకవర్గ విషయాలను వనమా వివరించినట్లు సమాచారం.
నేడు కొత్తగూడెంకు రానున్న వనమా..భారీ స్వాగతానికి సన్నాహాలు
వనమాకు ఊరటనిస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో బుధవారం కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన అనుచరులు సంబురాలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పు, ఇతర అంశాల నేపథ్యంలో నియోజకవర్గాని కి కొంతకాలంగా దూరంగా ఉన్న వనమా గురువా రం కొత్తగూడెం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ నాయకు లు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. సుజాతనగర్ మండలం నాయకులు గూడెం వద్ద భారీ ఊరేగింపుతో వనమాకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటు వనమా, అటు జలగం.. అధినేత ఎటో?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొంది ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనపై ఓటమి పొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు వనమాపై 2019లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వనమాను 2018 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అటు ఎన్నికల సంఘాన్ని, ఇటు అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలిశారు. అయితే వనమా సుప్రీంకోర్టు నుంచి నాలుగు వారాల పాటు స్టే పొందడంతో కొత్తగూడెం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటు ఎమ్మెల్యే వనమా, అటు జలగం వెంకట్రావు ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ ఉండడంతో అధినేత చ్చిం అనుసరించే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది.
సర్వేలు, పనితీరు ఆధారంగానే టికెట్లు
సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. టికెట్ల కేటాయింపు అంశం పూర్తిగా సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో వివాదాల జోలికి వెళ్లకుండా ఎన్నికలపై దృష్టి పెట్టి కేడర్‌ను సన్నద్ధం చేసుకోవాల్సిందిగా చ్చిం ఆదేశించినట్టు చెబుతున్నారు.