విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా డ్రగ్స్‌తో ఓ కంటైనర్ విశాఖకు వచ్చిందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని ఈ సందర్బంగా గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు ప్రచారం చేశారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడానికే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.
‘ గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. అధికారం కోసం నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. కంటైనర్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ లేవని చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది.
ఆపరేషన్ గరుడ అనే పేరుతో సీబీఐ విచారణ జరిపింది. చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేశారు. మాకు ఆ కంటైనర్‌కు సంబంధం లేదని మేము మొదటి నుంచి చెపుతూనే వచ్చాము, మేము చెప్పిందే సీబీఐ కూడా చెప్పింది. కంటైనర్ షిప్ పై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు అర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట’ అని గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: కుప్పంలో సీజ్ ది థియేటర్
Comments
Please login to add a commentAdd a comment