సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కాగా, ఆదివారం ఉదయం మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని లాస్య నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పరామర్శించారు.
— BRS Party (@BRSparty) February 25, 2024
వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. pic.twitter.com/T5jPw2JV69
విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/JTL25SzykP
— BRS Party (@BRSparty) February 25, 2024
Comments
Please login to add a commentAdd a comment