
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి (77) అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున స్వగృహంలో మృతి చెందారు. ఆయన 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు భార్య అన్నపూర్ణమ్మ, కుమారుడు మధుసూదనరెడ్డి, కుమార్తె ఉన్నారు.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, కన్నా లక్ష్మినారాయణతో పాటు పలువురు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, లక్ష్మారెడ్డి సోదరుడు వెంకటేశ్వరరెడ్డి నివాళులర్పించారు.